రాజా రఘువంశీ చనిపోయి కుటుంబం అంతా బాధలో ఉంటే.. అతడి సోదరి, ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రాస్తి రఘువంశీ మాత్రం.. పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందుతోంది. రాజాను భార్య అన్యాయంగా చంపేసిందంటూ.. అయ్యో.. పాపం.. దారుణం అంటూ దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే.. ఈ సమయంలో ఫాలోవర్లు పెంచుకునేందుకు శ్రాస్తి రఘువంశీ మాత్రం తాపత్రాయం పడుతోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో చేసేదేమీలేక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలన్నీ వరుసగా డిలీట్ చేసింది.
ఇది కూడా చదవండి: S*exual Assault: లైంగిక వేధింపుల నిందితుడి హతం.. 8 మంది మహిళలు అరెస్టు
మే 23న రాజా రఘువంశీ మేఘాలయలో హత్యకు గురయ్యాడు. భార్యతో హనీమూన్‌కు వెళ్తే.. ప్రియుడి సాయంతో సోనమ్ చంపేసి లోయలో పడేసింది. తర్వాత ఏమీ ఎరుగనట్టు యూపీకి పారిపోయింది. అయితే పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతోనో.. లేదంటే ఒత్తిడి భరించలేక ఏమో తెలియదు గానీ జూన్ 9న యూపీలోని ఘాజీపూర్ పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది.
ఇది కూడా చదవండి: Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..
శ్రాస్తికి 3.9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. రాజా-సోనమ్ వివాహ ఫొటోలు, వీడియోలు కూడా పోస్టు చేసింది. ఇక సోదరుడి మరణం తర్వాత న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. తాజాగా సోదరుడిది హత్య అని తేలాక.. సోనమ్‌నే చంపేసిందంటూ పోస్టులు పెట్టింది. అంతేకాకుండా పెళ్లికి ముందు తీసిన ప్రీ వెడ్డింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేసి క్యాష్ చేసుకుంటోంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సమయంలో పెళ్లి వీడియోలు పోస్ట్ చేయడం అవసరమా? అంటూ ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఆమె పోస్టులను తొలగిస్తోంది.