ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దాదాపు వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక 40-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మన్యంలో 4.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: KCR: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్..
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మే నెలలో 8 రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఇంత తొందరగా రుతుపవనాలు ప్రవేశించడం ఇదే తొలిసారి. రుతుపవనాలు త్వరగా రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుంటే కర్షకులు పంటలు వేసేందుకు మొగ్గు చూపుతుంటారు.
ఇది కూడా చదవండి: Coolie : తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!