ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీని మేఘాలయ పోలీసులు ఛేదిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. తాజాగా ప్రధాన నిందితులైన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాకు చెందిన మొబైల్స్‌ను పరిశీలించారు. ఇందులో ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ వెలుగులోకి వచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నానని.. ప్రస్తుతం అతడికి దూరంగా ఉన్నట్లు సోనమ్.. ప్రియుడికి మెసేజ్ పంపించింది. రాజా రఘువంశీతో పెళ్లైన 3 రోజులకే సోనమ్.. ప్రియుడికి మెసేజ్ పెట్టింది. అంతేకాకుండా వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని తన పుట్టింటికి వచ్చేసింది. దీంతో ఇద్దరు కలిసి రాజాను చంపాలని కుట్రపన్నారు. అయితే మృతదేహం దొరకకుండా ఉండేందుకు మేఘాలయ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజా అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు.. వీడియో వైరల్
మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కు వివాహం అయింది. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వచ్చారు. మే 23న హఠాత్తుగా జంట అదృశ్యమైంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేపట్టగా జూన్ 2న రాజా మృతదేహం లభించింది. కానీ సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కోసం కూడా గాలిస్తున్నారు. ఇంతలో ఆమె జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది.
ఇది కూడా చదవండి: Trump: గ్రెటా థన్‌బర్గ్ వ్యవహారంపై స్పందించిన ట్రంప్.. శిక్షణ తీసుకోవాలని సూచన
ప్రియుడు రాజ్ కష్వాహాతో కలిసి సోనమ్.. తన భర్త రాజాను చంపినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకే మేఘాలయ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మేఘాలయలో రాజా మృతదేహం పైకి తీసినప్పుడు అక్కడే సోనమ్ ప్రియుడు కూడా ఉన్నాడు. సోనమ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాడు. అంతేకాకుండా మృతదేహం తరలించే వాహనాల్లో ఒక వాహనాన్ని ఇండోర్‌కు తరలించాడు. అంతేకాకుండా రాజా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోమవారం రాజా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో రాజా శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లుగా తేలింది. అలాగే తల ముందు.. వెనుక భాగంలో కూడా బలమైన గాయాలు ఉండడంతో చనిపోయినట్లుగా తేలింది.