మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను తాజాగా కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50 శాతం టోల్ ఫీజులు తగ్గనున్నాయి.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నెలకొల్పాడు. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త ఎకానమీ రేటుతో ప్రసిద్ధ్ రికార్డు సృష్టించాడు. దీంతో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం క్రికెట్లో టీ20ల హవా నడుస్తోంది. ప్రతి దేశం ఒక్కో లీగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లీగ్స్ వున్నాయి. అయితే ఇప్పుడున్న క్రికెటర్లు కేవలం టీ20ల కోసం కూడా రిటైర్ అవుతున్నారు. కానీ ఒక ప్లేయర్ వీటన్నిటికీ భిన్నం.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్‌తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.
పూణె అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చెప్పిన మాటలకు ఖాకీలే షాక్ గురయ్యారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు.. విషయం తెలిసి మైండ్ బ్లాక్ అయింది.
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఎ-మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నాలో జరిగిన రాజకీయ హత్య తీవ్ర సంచలనంగా మారింది. ఇంటి ముందే వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.