వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50 శాతం టోల్ ఫీజులు తగ్గనున్నాయి.
ఇది కూడా చదవండి: Prasidh Krishna: టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్.. ప్రసిద్ధ్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్!
జాతీయ రహదారులపై కొన్ని సెక్షన్లలో టోల్ ఛార్జీలను 50 శాతం వరకు కేంద్రం తగ్గించింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి నిర్మాణాలు కలిగిన హైవేలపై భారీగా టోల్ రేట్లను తగ్గించింది. కేంద్ర నిర్ణయంతో వాహనదారులకు ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.
ఇది కూడా చదవండి: Kodali Nani: గుడివాడ పీఎస్‌కు మాజీ మంత్రి కొడాలి నాని..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై 2008 నిబంధనల ప్రకారం టోల్ ఛార్జీలు వసూలు చేస్తు్న్నారు. జూన్ 2న ఈ నిబంధనలను కేంద్రం సడలించింది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ఫీజులు సగానికి సగం తగ్గిపోయాయి. ఈ తగ్గింపు అనేది వంతెన, సొరంగం, ఫ్లైఓవర్, ఎలివేటెడ్ హైవేలపై వర్తించనుంది.