నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అకా రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్కౌంటర్లో రాజా చనిపోయాడు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి.
ఆకస్మిక వరదలు టెక్సాస్ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. నెలల తరబడి కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తేశాయి.
నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని నెతన్యాహు కొనియాడారు.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన 2వ టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అసలు మొదటి టెస్టులో ఓడిన తర్వాత, బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎలా ఆడుతుందో అని అందరూ అనుకున్నారు.
26/11 ముంబై దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని ముంబై పేలుళ్ల కుట్రదారుడు తహవూర్ రాణా అంగీకరించాడు. తహవూర్ రాణాను అమెరికా.. భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. విచారణలో తహవూర్ రాణా సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.