పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వార్త మరోసారి జాతీయ స్థాయిలో రచ్చ చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లుగా తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి.
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున భీకరదాడులు చేసింది. రెబల్స్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు, వారి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
బీహార్‌లో వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి ముందే ఖేమ్కాను తుపాకీతో కాల్చి చంపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి.
నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది.
ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్‌ను అతలాకుతలం చేశాయి. నెలల పాటు కురవాల్సిన వర్షమంతా కొన్ని గంట్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడాలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకన్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి.
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారుడు అని తెలిపారు.