ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నెలకొల్పాడు. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త ఎకానమీ రేటుతో ప్రసిద్ధ్ రికార్డు సృష్టించాడు. దీంతో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: న్యాయమంటే కేవలం శిక్షలు విధించడమే కాదు.. బాధితుల జీవితానికి భరోసా కల్పించాలి..
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో భారీ పరుగులు చేయడంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఇప్పుడు ఓటమి దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 84 పరుగులకే 5 వికెట్లు తీసిన టీమిండియా పేసర్లు, ఆ తర్వాత వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు.
ఇది కూడా చదవండి: OSSS : మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ ‘ఓం శాంతి శాంతి శాంతిః
మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ హరీ బ్రూక్ మరియు జమీ స్మిత్ బ్యాటింగ్ దెబ్బకు మన పేసర్లు మరోసారి చేతులెత్తేసారు. ఇక టెస్ట్ క్రికెట్‌లో ఓవర్‌కు 5 పరుగులకు పైగా ఎకానమీతో, ప్రసిద్ధ్ కృష్ణ ప్రపంచంలోని చెత్త బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. దాంతోపాటు ఒకే ఓవర్‌లో 23 పరుగులు సమర్పించుకోగా, ఇలాంటి బౌలింగ్‌తో వికెట్లు ఎలా వస్తాయి అని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును కూడా తన పేరిట వేసుకున్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణకు మూడో టెస్టులో చోటు కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.