UP: యూపీలో ఘోరం.. గోడను ఢీకొట్టిన కారు.. వరుడు సహా 8 మంది మృతి
- ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
- గోడను ఢీకొట్టిన కారు
- వరుడు సహా 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్‌యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Iswarya Menon : కొబ్బరి బోండంతో వలపువల విసురుతున్న ఐశ్వర్య మీనన్
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్‌యూవీ కారు జెవానై గ్రామంలో కళాశాల గోడను ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తుండడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. గోడను ఢీకొట్టి బోల్తా పడింది. సంఘటనాస్థలిలోనే వరుడు ప్రాణాలు వదిలాడు. కొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన సమయంలో వరుడు చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుమకున్నాయి.
ఇది కూడా చదవండి: IND W vs ENG W 3rd T20I: 25 బంతుల్లో 9 వికెట్లు పడగొట్టారు.. అయినా ఓడిపోయారు
సంభాల్‌లోని హర్ గోవింద్‌పూర్ గ్రామం నుంచి పొరుగున ఉన్న బుడాన్ జిల్లాలోని సిర్టౌల్‌లోని వధువు గ్రామానికి వరుడు సూరజ్, కుటుంట సభ్యులు కారులో వెళ్తున్నారు. దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు కారులో కూర్చున్నారు. ఉదయం పూట రోడ్లు ఖాళీగా ఉండడంతో కారును డ్రైవర్ అత్యంత వేగంగా పోనిచ్చాడు. హఠాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టాడు. కారు బోల్తా పడడంతో వరుడు సూరజ్(24) అక్కడికక్కడే మరణించాడు. మృతుల్లో వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, గుర్తు తెలియని ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలీఘర్‌లోని ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) అనుకృతి శర్మ సందర్శించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!