అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్ హిల్ కంట్రీలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలు కారణంగా 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్ నుంచి 23 మంది పిల్లలు గల్లంతయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది.
వీధుల్లో తిరిగే గ్రామ సింహాలైన కుక్కలతోనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అవి సృష్టించే బీభత్సాలకు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడొక చోట కుక్కుల దాడిలో చనిపోతున్నారు. అలాంటిది అడవుల్లో ఉండే సింహాలు రోడ్లపైకి వస్తే.. ఇంకేమైనా ఉందా? ఇక ప్రాణాలు పోయినట్టే.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దిశకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ-ట్రంప్ మధ్య సంభాషణ జరిగిన తర్వాత జూలై 9కి ముందు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
రష్యా-ఉక్రెయిన్ వెనుక యుద్ధాలు మొదలు పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కాల్పుల విరమణతో శాంతి వాతావరణం చోటుచేసుకున్నాయి. ఇరాన్-గాజా-ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు.
హిమాచల్‌ప్రదేశ్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. గత కొద్ది రోజులు ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. ఓ కుండపోత వర్షాలు.. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. ఆర్థిక నేరగాళ్లంతా ఒక చోట చేరి ఫుల్‌ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశానికి వెన్నుపోటు పొడిచి.. కోట్లలో ఎగనామం పెట్టేసి విదేశాల్లో మాత్రం జల్సాలు అనుభవిస్తున్నారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య 60 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినా కూడా గాజాపై దాడులు ఆగడం లేదు. ఇంకోవైపు హమాస్‌ను అంతం చేసేదాకా వదిలిపెట్టబోమని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు.