ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రుల అరెస్ట్‌లను పర్యవేక్షించిన ఐఆర్ఎస్ అధికారి కపిల్ రాజ్ తన సర్వీస్‌కు గుడ్‌బై చెప్పారు. 16 సంవత్సరాలు సర్వీసు తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.
బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా పాలసీలు వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని.. మినహాయింపులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు.
పహల్గామ్లో మారణహోమానికి తెగబడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ను అగ్ర రాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబాకు ముసుగు సంస్థగా టీఆర్ఎఫ్ పని చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.
భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి పొడిగించింది. ఆగస్టు 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈడీ షాకిచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.
యెమెన్‌లో ఉరిశిక్ష పడిన భారత సంతతి నిర్సు నిమిషా ప్రియకు ప్రస్తుతం ఊరట లభించింది. నిమిషా ప్రియకు ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
సూపర్సోనిక్ స్కైడైవ్కు మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్(56) కన్నుమూశాడు. ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడు. 2012లో స్ట్రాటో ఆవరణ నుంచి ధ్వని అవరోధాన్ని బద్దలు కొట్టిన దిగ్గజ స్కైడైవర్‌గా ఫెలిక్స్ బామ్గార్ట్నర్ పేరుపొందాడు.