ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్.అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతానందన్ జీవితమంతా ప్రజా సేవకే అంకితం అయిపోయిందని.. కేరళ పురోగతికి జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.
పాఠశాలల్లో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నిబంధనను సవరిస్తూ తన పరిధిలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజే హాట్‌హాట్‌గా సమావేశాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సిందూర్, బీహార్ ఎన్నికల ప్రక్రియ, పలు అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసుండాలని వివాహాలు జరిపిస్తుంటే.. మధ్యలోనే కుప్పకూల్చుకుంటున్నారు. క్షణిక సుఖకోసం భాగస్వాములను అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
గల్ఫ్ దేశంలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో భారతీయ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేరళకు చెందిన అత్యుల్య శేఖర్ శనివారం తెల్లవారుజామున యూఏఈలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి-మార్చి మధ్యలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి.
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్.అచ్చుతానందన్ (101) తుదిశ్వాస విడిచారు. సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.