పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్‌పై రెచ్చగొట్టిన ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పుడు కథనాలని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు కొట్టిపారేశారు. అంతర్జాతీయ మీడియా సొంత కథనాన్ని ప్రసారం చేస్తున్నాయని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.
సోనమ్ రఘువంశీ.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా మరిచిపోయే పని చేసిందా?. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేసి లోయలో పడేసింది. ఈ ఘటన యావత్తు మహిళా లోకాన్నే కాకుండా.. దేశాన్నే కలవరపాటుకు గురిచేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్‌నే కారణమంటూ అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిందంటూ వార్తలు వండి వార్చాయి.
తమిళనాడులోని నీలగిరి కొండల్లో అరుదైన నల్ల చిరుత ప్రత్యక్షం అయింది. రెండు సాధారణ చిరుతలతో పాటు నల్ల చిరుత కనిపించింది. వాటితో కలిసి తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. ప్రపంచ పోలీస్–ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను అమిత్ షా ఘనంగా సన్మానించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం అనేక మార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చల కారణంగానే కాల్పుల విరమణ జరిగిందని.. ఇందుకు మూడో వ్యక్తి ప్రమేయం ఏ మాత్రం లేదని భారత్ అనేక మార్లు మీడియా సముఖంగా ప్రకటించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటీవల జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు హల్చల్ చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా కథనాలు వండి వార్చాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెంట్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేశారు. ఇక మీడియా కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా […]