బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా పాలసీలు వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని.. మినహాయింపులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: China: టీఆర్‌ఎఫ్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
తాజాగా బ్రిక్స్ కూటమిపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అది చిన్న గ్రూప్ అంటూ విమర్శించారు. ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్’ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. అనంతరం వైట్‌హౌస్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యా్ఖ్యలు చేశారు. మాతో ఆటలొద్దని.. డాలర్ విలువ తగ్గడానికి మేము ఎన్నిటికీ అంగీకరించోమన్నారు. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే.. దాన్ని ఓటమిగానే భావిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలున్నాయి. అనంతరం ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా కూడా చేరాయి. ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఆందోళన వ్యక్తంచేశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు.. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాల పైనా టారిఫ్‌లు ఉంటాయని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Sreeleela : బాలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. అనంతరం వ్యతిరేకత రావడంతో మూడు నెలల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగిసింది. అనంతరం ఆగస్టు 1 వరకు పొడిగించారు. ప్రస్తుతం యూకే, వియత్నాం, చైనా మాత్రమే అమెరితో ఒప్పందాలు చేసుకున్నాయి. మిగతా దేశాలు చేసుకోలేదు. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయితే భారత్‌లో వ్యవసాయం. పారి పరిశ్రమలపై అమెరికా రాయితీలు కోరుతోంది. అయిదే ఇవే మన దేశానికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే భారత్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అయితే త్వరలోనే భారత్-అమెరికా మధ్య ఒప్పందాలు జరగొచ్చని సమాచారం.