భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి పొడిగించింది. ఆగస్టు 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపివేసింది. దీనికి బదులుగా పాకిస్థాన్.. భారతీయ విమానాలు రాకుండా గగనతలాన్ని మూసేసింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 24 వరకు పొడిగిస్తూ పాకిస్థా్న్ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని అడగాలన్న సుప్రీంకోర్టు
పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) ప్రకారం.. ఈ నిషేధం భారతీయ విమానయాన సంస్థలు నిర్వహించే అన్ని విమానాలకు.. అలాగే భారతీయ యాజమాన్యంలోని లీజుకు తీసుకున్న సైనిక, పౌర విమానాలకు వర్తిస్తుందని పేర్కొంది. జూలై 19న మధ్యాహ్నం 3:50 గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానుంది. ఆగస్టు 24న ఉదయం 5:19 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.
ఇది కూడా చదవండి: Harish Rao: “ఎన్ని చేసినా కేసీఆర్ స్థాయికి రాలేవు”.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే పాకిస్థాన్ స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు గగనతలంపై నిషేధం విధించుకున్నాయి.