ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈడీ షాకిచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. భిలాయ్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈడీ వాహనాలకు అడ్డుతగిలారు. భారీగా పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఆందోళనకారుల్ని పక్కకు నెట్టి చైతన్య కారును ముందుకు పోనిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు చైతన్యది పుట్టినరోజు. శుక్రవారమే అరెస్ట్ చేయడంపై మాజీ ముఖ్యమంత్రి బాఘేల్ ఆవేదన వ్యక్తం చేశారు. భూపేశ్ బాఘేల్ అసెంబ్లీలో ఉన్నప్పుడు కుమారుడిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని అడగాలన్న సుప్రీంకోర్టు
శుక్రవారం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలోని భూపేశ్ ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే చోట నివసిస్తున్నారు. ఈ కేసులో కొత్త ఆధారాలు అందిన తర్వాత సోదాలకు చైతన్య సహకరించడం లేదని ఆరోపిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Jaishankar: టీఆర్ఎఫ్‌ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని స్వాగతించిన భారత్
రాయ్‌గఢ్ జిల్లాలోని తమ్నార్ తహసీల్‌లో అదానీ గ్రూప్ బొగ్గు గని ప్రాజెక్టు కోసం చెట్లను నరికివేసే అంశాన్ని లేవనెత్తనున్న సమయంలో అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఈడీ తన ఇంటికి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బాఘేల్ ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ నెల ప్రారంభంలో బాఘేల్ తహసీల్‌ను సందర్శించి.. ఆ ప్రాంతంలో బొగ్గు గని ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థానిక గ్రామస్తులకు మద్దతు తెలిపారు.
VIDEO | Bhilai, Chhattisgarh: Congress workers clash with police personnel and try to stop ED vehicles after Chaitanya Baghel, son of former CM Bhupesh Baghel, was taken into custody by the Enforcement Directorate.
The Enforcement Directorate (ED) conducted fresh searches at the… pic.twitter.com/beb7Eq7Pnq
— Press Trust of India (@PTI_News) July 18, 2025