ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రుల అరెస్ట్‌లను పర్యవేక్షించిన ఐఆర్ఎస్ అధికారి కపిల్ రాజ్ తన సర్వీస్‌కు గుడ్‌బై చెప్పారు. 16 సంవత్సరాలు సర్వీసు తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లపై కేసులు సహా ఉన్నత స్థాయి ఈడీ దర్యాప్తులకు పేరుగాంచిన కపిల్ రాజ్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లో ఎనిమిదేళ్ల పాటు కపిల్ రాజ్ పనిచేశారు. కపిల్ రాజ్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా సున్నితమైన రెండు అరెస్ట్‌లను పర్యవేక్షించారు. భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన మనీలాండరింగ్ నిరోధక కేసుల్లో కీలక పాత్ర పోషించారు. కపిల్ రాజ్.. 2009 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. 16 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాజ్ రాజీనామాను జూలై 17 నుంచి భారత రాష్ట్రపతి ఆమోదించారని నివేదికలు అందాయి. ప్రస్తుతం కపిల్ రాజు వయసు 45 ఏళ్లు. ఇంకా 15 సంవత్సరాల సర్వీస్ ఉంది. ప్రస్తుతం రాజ్.. ఢిల్లీలోని జీఎస్టీ విభాగంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: China: టీఆర్‌ఎఫ్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
గత ఏడాది జనవరిలో భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు ఆయన నాయకత్వం వహించారు. రాంచీలోని రాజ్ భవన్‌లో సోరెన్ రాజీనామా సమయంలో రాజ్ అక్కడే ఉన్నారని, అతన్ని అదుపులోకి తీసుకున్నారని జాతీయ మీడియా తెలిపింది. ఇక మార్చిలో ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు రాజ్ కూడా ఆయన నివాసంలో ఉన్నారు. అరెస్ట్ మెమో తయారీ మరియు డెలివరీని రాజ్ పర్యవేక్షించారని తెలిపింది. కపిల్ రాజ్ సోదాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించడం, రాజకీయ నాయకుల ప్రశ్నాపత్రాలను పరిశీలించడం మరియు కార్యకలాపాల సమయంలో దర్యాప్తు బృందాలను ప్రేరేపించడంలో ప్రసిద్ధి చెందారని నివేదించింది. ఇక ముంబై పోస్టింగ్ సమయంలో ప్రధాన ఆర్థిక నేరాల దర్యాప్తులను కూడా నిర్వహించారు. అలాగే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మనీలాండరింగ్ కేసులు కూడా డీల్ చేశారు.
కపిల్ రాజ్.. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాకు చెందినవాడు. ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్ డిగ్రీని చదివారు. కెరీర్‌లో కీలకమైన దర్యాప్తు విభాగాల్లో ముఖ్యంగా కస్టమ్స్, జీఎస్టీ నిఘా మరియు ఆర్థిక నేరాల అమలుకు సంబంధించిన పోస్టింగ్‌లు నిర్వహించారు.
