UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
- వరకట్న దాహానికి మరో అబల బలి
- యూపీలో భార్యను చంపిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాత్రియుగం నుంచి రాకెట్ యుగానికి వచ్చాం. కాలాలు.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అజ్ఞానంతో దారుణాలకు ఒడిగట్టేవారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. సంపద పెరిగింది. ఇలాంటి తరుణంలో క్రైమ్ రేట్ తగ్గాల్సింది పోయి.. క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య వరకట్న పిశాచి దేశాన్ని వెంటాడుతోంది. రోజూ ఎక్కడొక చోట వరకట్న దాహానికి అబల బలైపోతుంది. ఇటీవలే నోయిడాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే రాజస్థాన్‌లో మూడేళ్ల కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం అయ్యారు. తాజాగా ఇదే తరహాలో యూపీలో మరో అబల ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
దేవేంద్ర-పరుల్(32) భార్యాభర్తలు. దేవేంద్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పరుల్ నర్సు శిక్షణ పొందింది. ఇటీవలే రాంపూర్ నుంచి బరేలీకి దేవేంద్ర బదిలీ అయ్యాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలంటూ పరుల్‌ను దేవేంద్ర హింసిస్తున్నాడు. సెలవుపై ప్రస్తుతం దేవేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నారంగ్‌పూర్ గ్రామంలో ఉండగా మళ్లీ కట్నం కోసం గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరుల్‌కు దేవేంద్ర, బంధువులు నిప్పంటించారు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించారు. చికిత్స పొందుతూ పరుల్ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అమ్రోహా జిల్లా పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దేవేంద్ర సహా కుటుంబ సభ్యులపై కేసు బుక్ చేశారు.
ఇది కూడా చదవండి: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో దేవేంద్ర, అతడి బంధువులు పరుల్‌ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. పరుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు భర్త దేవేంద్ర, అతని తల్లి, సోను, గజేష్, జితేంద్ర, సంతోష్ అనే నలుగురు మగ బంధువులపై గృహ హింస, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరుగురు నిందితులంతా పరారీలో ఉన్నారని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున పొరుగువారు తమకు ఫోన్ చేసి చెప్పారని పరుల్ తల్లి అనిత తెలిపింది. కుమార్తె దగ్గరకు రాగానే నొప్పితో విలవిలలాడుతోందని చెప్పింది. తీవ్రగాయాలతోనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని.. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రాణాలతో పోరాడుతో ప్రాణాలు కోల్పోయిందని కన్నీరు మున్నీరు అయింది. 13 ఏళ్ల క్రితం దేవేంద్రకు ఇచ్చి వివాహం చేశామని.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని చెప్పింది.
- Tags
- dowry
- husband
- UP
- UP woman burnt
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!