ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం జపాన్ చేరుకున్నారు. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Russia: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి
ఇక పర్యటనలో భాగంగా శనివారం జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి మోడీ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. రైల్లోంచి కొత్త ఆల్ఫా-ఎక్స్ రైలును కిటికీ నుంచి గమనించారు. ఇక రైలు గురించి జేఆర్ ఈస్ట్ ఛైర్మన్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇషిబా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సెండాయ్‌లోని తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను కూడా మోడీ పరిశీలించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్ట్ కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E-10 కోచ్‌లను పరిశీలించనున్నారు. అనంతరం ఒక ఒప్పందంపై సంతకం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
ఇక జపాన్ పర్యటన తర్వాత ఆదివారం మోడీ చైనాకు చేరుకోనున్నారు. టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొననున్నారు. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోడీ సమావేశం కానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు. చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్‌లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
Japan PM Shigeru Ishiba tweets, "With Prime Minister Modi to Sendai…" pic.twitter.com/k9xljgOeV5
— ANI (@ANI) August 30, 2025
Japan PM Shigeru Ishiba tweets, "Greetings the Indian train drivers currently training at JR East." pic.twitter.com/B2Ssz3v2r5
— ANI (@ANI) August 30, 2025