శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌సింగ్ పై విధంగా స్పందించారు.
నేటి ప్రపంచం చాలా వేగంగా మారుతోందని.. ప్రతిరోజూ కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయని చెప్పారు. ఉగ్రవాదం అయినా… ప్రాంతీయ సంఘర్షణలు అయినా.. అన్ని సవాళ్లతో కూడుకున్నదే అని తెలిపారు. శతాబ్దం నుంచి అన్ని రంగాల్లో అత్యంత అస్థిరంగా.. సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో వ్యూహాత్మక అవసరాల గురించి మాట్లాడకూడదన్నారు. అలా చేస్తే స్వావలంబన్ అవుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Indore: విచిత్ర ప్రేమికురాలు.. ప్రేమికుడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రివర్స్‌లో ఏం చేసిందంటే..!
భారతదేశం ఎప్పుడూ ఎవరినీ శుత్రువులగా చూడదన్నారు. తమకు రైతులు, వ్యవస్థాపకుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ, భద్రత అత్యంత ప్రాముఖ్యం అని పేర్కొన్నారు. 2014లో రక్షణ ఎగుమతి రూ.700 కోట్ల కంటే తక్కువగా ఉండేదని.. ఇప్పుడు దాదాపు రూ.24,000 కోట్లకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పారు. భారతదేశం ఇకపై కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదని.. ఎగుమతిదారుగా కూడా మారుతోందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది. ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ ప్రకటించారు.