UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు
- యూపీ సర్కార్ కీలక నిర్ణయం
- కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా
- 3 రెట్ల జీతం పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాతో పాటు 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీతాలతో పాటు అదనంగా అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కాశీ విశ్వనాథ ఆలయ ఉద్యోగులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఇతర వర్గాల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటారని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: UK: యూకే చరిత్రలో సరికొత్త అధ్యయనం.. హోం కార్యదర్శిగా ముస్లిం మహిళ నియామకం
Also Read
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
ప్రస్తుతం పూజారులకు, ఉద్యోగులకు నెలకు రూ.30,000 అందుతున్నాయి. ఇప్పుడు ఈ జీతాలు మూడు రెట్లు పెంచారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంత స్థాయిలో జీతాలు పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ్ ఒకటిగా ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పరిపాలనను చేపట్టింది. ఆనాటి నుంచి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. యోగి సర్కార్ నిర్ణయం కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్‌పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
గురువారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మీర్జాపూర్‌లోని కాక్రాహిలో 46 బిఘాల ఆలయ భూమిలో వేద విద్య, శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ ధామ్, శక్తి పీఠం విశాలాక్షి మాత ఆలయం మధ్య ప్రత్యక్ష మార్గాన్ని సృష్టించడానికి భవనాల కొనుగోలుకు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. సారనాథ్‌లోని బేనిపూర్‌లోని సంకట్ హరన్ హనుమాన్ ఆలయ అభివృద్ధి, గోశాల ఆధునీకరణకు కూడా పచ్చజెండా ఊపింది. అప్‌గ్రేడ్ చేసిన కంట్రోల్ రూమ్, ఆధునిక నిఘా కెమెరాలతో ధామ్ దగ్గర భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయనుంది. అదనంగా లడ్డూ ప్రసాదం, రుద్రాక్ష మాలాల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆమోదించింది.
తాజావార్తలు
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!