యుద్ధాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలపై రోజుకో మాట మారుస్తున్నారు. గురువారం టెక్ సీఈవోలతో భేటీ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకొచ్చారు. తాజాగా అమెరికా కాంగ్రెస్ సభ్యులకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు యుద్ధాలను తానే ఆపానంటూ మరోసారి డబ్బా కొట్టుకున్నారు. కాకపోతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయానన్నారు. ఈ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా కానీ.. ఆపలేకపోయాయని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఎంఎల్సీ కవిత ఆరోపణలపై హరీశ్ రావు స్పందన ఘాటైన కౌంటర్
2024 అమెరికా ఎన్నికల సమయంలో ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే ఒక్కరోజులోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. తాజాగా అదే అంశం గురించి విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయినట్లు ఒప్పుకున్నారు. తన హయాంలో చూసిన అత్యంత క్లిష్టమైన ఘర్షణ ఇదేనని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత..
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ పురోగతి లభించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి పుతిన్, జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అయినా కూడా సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. 2022 నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. అనంతరం జరిగిన యుద్ధాలు మాత్రం ఆగిపోయాయి.