తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్‌పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: UP: లక్నో అమిటీ వర్సిటీలో దారుణం.. సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు
పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని.. బహిష్కరించిన వారిని తిరిగి 10 రోజుల్లో పార్టీలో చేర్చుకోవాలంటూ పళనిస్వామికి మాజీ మంత్రి సెంగోట్టయన్ డెడ్‌లైన్ విధించారు. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌తో సహా అందరిని చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తీరా చూస్తే సెంగోట్టయన్‌కే పళనిస్వామి షాకిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారంటూ ఈరోడ్డు రూరల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి పళనిస్వామి తొలగించారు. ఎమ్మెల్యే సెంగొట్టయన్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు శనివారం పళనిస్వామి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు
శనివారం ఉదయం దిండిగల్‌లోని ఒక హోటల్‌లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఏడుగురు సీనియర్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు గంటకు పైగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల సెంగోట్టయన్ సంతోషం వ్యక్తం చేశారు. బహిష్కరించబడిన నాయకులను తిరిగి తీసుకువస్తేనే అన్నాడీఎంకే ఎన్నికల్లో గెలవగలదని అభిప్రాయపడ్డారు. ఎంజీఆర్, జయలలితతో సెంగోట్టయన్ పనిచేశారు. దాదాపు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడనున్నాయి. ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
