వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైరయ్యారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగుదేశం పార్టీని, నన్ను తిట్టనిదే కాకాణికి తిన్నది అరగడం లేదు. కొవ్వు పట్టి నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వెంకటాచలంలో జరుగుతున్న సాగరమాల నేషనల్ హైవే రోడ్డు పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఏయంఆర్, మేకపాటి వాళ్లు చేస్తున్న పనులకు ప్రభుత్వానికి డబ్బులు కట్టి గ్రావెల్, ఇసుక తోలుకుంటున్నారు. మీ పార్టీకి చెందిన వ్యక్తులే నిర్మాణం చేస్తున్నారు. అందులో నా అవినీతి ఏముంది.’’ అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Ravindranath Reddy: ఏపీలో అవినీతి రాజ్యమేలుతోంది
‘‘త్వరలో కాకాణి భూ దోపిడీని ఆధారాలతో బయట పెడుతాను. అవినీతి, అక్రమాలు చేసిన దాంట్లో కాకాణికి పీహెచ్‌డీ వచ్చింది. 204 రోజులు తప్పించుకు తిరిగి ఆజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడు చేశాడు. కాకాణి అభిమానిగా మారిపోయాను. 204 రోజులు ఆజ్ఞాతంలో ఉన్న కాకాణికి డాక్టరెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.’’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: ఉద్దేశపూర్వకంగానే టీటీడీ ఛైర్మన్ ఇంటర్వ్యూలు ఆపేశారు