ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్(67). తమిళనాడు వాసి. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన్ను ఎన్డీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ విజయం సాధించారు. దీంతో ఆయన 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీఏ నేతలంతా పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
జూలై 21న జగదీప్ ధన్‌కర్ అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇదిలా ఉంటే జగదీప్ ధనకర్ ఈనాటి వరకు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: షాకింగ్ మర్డర్స్.. భార్య, ప్రియుడి తలలు నరికి పోలీస్స్టేషన్కు వెళ్లిన భర్త!