పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో గోల్డ్ లవర్స్ హడలెత్తిపోయారు. కొనాలంటేనే భయపడిపోయారు. తాజాగా ధరలకు బ్రేకులు పడ్డాయి. గురువారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిన్నటి ధరలే ట్రేడ్ అవుతున్నాయి.ఇక సిల్వర్ ధరలో మాత్రం ఊరట లభించింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది.
ఇది కూడా చదవండి: Bengaluru Video: బస్సులో కొట్టుకున్న డ్రైవర్-మహిళా ప్రయిణికురాలు.. ఏం జరిగిందంటే..!
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,509 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82, 880 దగ్గర అమ్ముడవుతోంది. ఇక సిల్వర్ ధర మాత్రం ఊరట కలిగించింది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గి రూ.1,29.900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.1, 40, 000 దగ్గర అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.1,29.900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Sathya sai district: దారుణం.. భార్యను చంపిన జులాయి భర్త.. కారణమేంటో తెలిస్తే..!