అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ బాగా సక్సెస్ అయిందని మంత్రి పార్థపారధి అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘అనంతపురం సభకు ప్రజలు ఊహించని దాని కన్నా ఎక్కువ మంది వచ్చారని.. ఇది చూడలేకే జగన్ తన బాధ వెళ్లగక్కుతున్నారు. జగన్ భాష జుగుప్సాకరంగా ఉంది. చంద్రబాబును ఏదైనా బావిలోకి దూకి చావ మనడం.. జగన్ దిగజారుడు తనానికి నిదర్శనం. ఇంతకంటే నీచమైన భాష ఉంటుందా? జగన్ చెప్పినట్లు ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. జగన్ మొదటి ఏడాదిలో ఒక నెలకు రూ.1300 కోట్లు పెన్షన్ ఇస్తే.. కూటమి ప్రభుత్వం రూ.2600 కోట్లు ఇస్తోంది.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Somireddy Chandra Mohan: అవినీతి, అక్రమాల్లో కాకాణికి డాక్టరేట్ ఇవ్వొచ్చు
‘‘జగన్ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం-ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా?, మెగా డీఎస్సీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, పొలీస్ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ చేశాం. రూ.8400 కోట్ల ప్రాజెక్ట్‌తో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి కనీసం 5 మెడికల్ కాలేజీలు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. 10 శాతం నిధులు ఖర్చు పెట్టి మేమే చేశాము అని చెప్పడం మంచిది కాదు. ఇవాళ అన్ని రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం.. పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.’’ అని మంత్రి పార్థసారధి వివరించారు.
ఇది కూడా చదవండి: Somireddy Chandra Mohan: అవినీతి, అక్రమాల్లో కాకాణికి డాక్టరేట్ ఇవ్వొచ్చు