NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో పాటు సినిమా బడ్జెట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో గోపీచంద్ మలినేని చెప్పిన ఓ హిస్టారికల్ కథకు భారీ బడ్జెట్ అవసరమవుతుందని భావించి బాలయ్య దాన్ని పక్కన పెట్టి, వేరే కథతో సినిమా చేస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉండగా.. రూ.100 కోట్ల పరిధిలోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే కొరటాల శివ సినిమాను మాత్రం సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రారంభ సమయంలో నిర్మాతలు వెల్లడించడంతో అప్పట్లోనే పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా అదే బడ్జెట్ అంశం కారణంగా బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కొరటాల శివ తదుపరి ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ను తెరకెక్కించే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల గాయమైన సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని తిరిగి ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగు పెట్టి త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాతనే దేవర 2 పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో బాలయ్య – కొరటాల సినిమా పరిస్థితి ఏంటి? కొరటాల తదుపరి అడుగు ఎటు? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..