Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Free Lassi Recipe: వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు చల్లని పదార్థాలను.. ద్రవ పదార్థాలను తీసుకుంటాం.. ఇక, ఈ సమయంలో చల్లటి లస్సీ తాగితే శరీరానికి వెంటనే తేలికగా అనిపిస్తుంది. ముఖ్యంగా మండే ఎండలో ఒక గ్లాసు చిక్కటి, క్రీమీ లస్సీ తాగితే అలసట మొత్తం పోయినట్టే. అయితే, లస్సీలో ఎక్కువగా చక్కెర వేయడం వల్ల బరువు పెరుగుతామేమోనని చాలామంది దానికి దూరంగా ఉంటారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారు, డయాబెటిస్ ఉన్నవారు కూడా లస్సీ తాగడాన్ని తగ్గిస్తుంటారు. అయితే ఇప్పుడు చక్కెర లేకుండానే తియ్యగా, క్రీమీగా ఉండే లస్సీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో చక్కెరకు బదులుగా సహజమైన తీపి పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రుచిలో మాత్రం ఎలాంటి తగ్గుదల ఉండదు.
సహజ తీపితో ఆరోగ్యకరమైన లస్సీ
ఈ ప్రత్యేక లస్సీ రెసిపీలో ఖర్జూరాలు, తేనె వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి లస్సీకి తీపి ఇవ్వడమే కాకుండా దానిని మరింత చిక్కగా, క్రీమీగా మారుస్తాయి. తాజా మీగడ పెరుగు ఉపయోగిస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
కావలసిన పదార్థాలు
* తాజా చిక్కటి పెరుగు – 2 కప్పులు
* చల్లటి పాల మీగడ – 2 నుంచి 3 టీస్పూన్లు
* గింజలు తీసిన ఖర్జూరాలు – 4 నుంచి 5
* తేనె – 1 టీస్పూన్ (ఐచ్ఛికం)
* యాలకుల పొడి – చిటికెడు
* చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ – అవసరమైనంత
* తరిగిన బాదం, పిస్తా – అలంకరణ కోసం
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలను కొద్దిసేపు నీటిలో నానబెట్టి గింజలు తీసేయాలి. తరువాత వాటిని కొద్దిగా చల్లటి నీరు లేదా పాలతో కలిసి మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో తాజా పెరుగు, ఖర్జూర పేస్ట్, యాలకుల పొడి, సగం మీగడ వేసి బాగా కలపాలి. మిక్సర్‌లో వేస్తే కేవలం 10 నుంచి 15 సెకన్ల పాటు మాత్రమే పల్స్ చేయాలి. ఎక్కువగా బ్లెండ్ చేస్తే లస్సీ పల్చగా మారే అవకాశం ఉంటుంది. తయారైన చిక్కటి లస్సీని గ్లాసులో లేదా మట్టి కుండలో పోయాలి. పైగా మిగిలిన మీగడ వేసి, తరిగిన బాదం, పిస్తాతో అలంకరించాలి.
రుచితో పాటు ఆరోగ్యం కూడా
ఈ లస్సీలో చక్కెరకు బదులుగా ఖర్జూరాలు ఉపయోగించడం వల్ల సహజ తీపి లభిస్తుంది. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది. చల్లగా సర్వ్ చేస్తే ఈ షుగర్ ఫ్రీ లస్సీ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయగల ఈ లస్సీ ట్రై చేయండి మరి..
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!