Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural Hair Color: వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చేస్తోంది.. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది.. ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపించగానే చాలామంది వెంటనే హెయిర్ డైలను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయితే రసాయనాలతో నిండిన హెయిర్ కలర్స్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం, మెరుపు కోల్పోవడం, తలకు చికాకు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఖరీదైన హెయిర్ డైలు లేకుండానే ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో జుట్టుకు నలుపు రంగు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు జుట్టుకు సహజ రంగును ఇవ్వడమే కాకుండా దానిని మృదువుగా, ఆరోగ్యంగా.. మెరిసిపోయేలా చేస్తుందంటున్నారు..
టీ ఆకులు, ఉసిరితో సహజ హెయిర్ కలర్
జుట్టుకు సహజమైన నలుపు లేదా ముదురు గోధుమ రంగు రావాలంటే టీ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ముందుగా టీ ఆకులను నీటిలో బాగా మరిగించాలి. ఆ తరువాత అందులో ఉసిరికాయ పొడి, కొద్దిగా హెన్నా వేసి ఇనుప పెనంలో కొంతసేపు ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట తర్వాత కడిగేస్తే జుట్టుకు సహజమైన ముదురు రంగు వస్తుంది.
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
మందార పువ్వులతో జుట్టుకు మెరుపు
మందార పువ్వులు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందార పువ్వులు, ఆకులతో పేస్ట్ తయారు చేసి అందులో టీ నీరు, ఉసిరికాయ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు 40 నుంచి 50 నిమిషాల పాటు పట్టించి కడిగేస్తే జుట్టుకు సహజమైన మెరుపు, తేలికపాటి రంగు వస్తుంది. అదనంగా జుట్టు మృదువుగా కూడా మారుతుంది.
కాఫీ, బ్లాక్ టీతో బ్రౌన్ షేడ్
జుట్టుకు బ్రౌన్ కలర్ రావాలనుకునేవారికి కాఫీ, బ్లాక్ టీ మంచి ప్రత్యామ్నాయాలు. గట్టిగా మరిగించిన బ్లాక్ టీ లేదా కాఫీని జుట్టుకు అప్లై చేస్తే క్రమంగా జుట్టుకు ముదురు గోధుమ రంగు వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని తరచూ ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
సహజ చిట్కాలు ఉపయోగించే ముందు జాగ్రత్తలు
అయితే, సహజ పదార్థాలు రసాయన హెయిర్ డైల్లా కఠినంగా ఉండవు. అయినప్పటికీ ప్రతి ఒక్కరి జుట్టు స్వభావం వేర్వేరుగా ఉండటంతో కొత్తగా ఏదైనా ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఇప్పటికే జుట్టు ఎక్కువగా దెబ్బతిన్నా లేదా తల చర్మ సమస్యలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం రంగు వేయడం మాత్రమే సరిపోదు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా తలకు నూనె మర్దన చేయడం కూడా ఎంతో అవసరం.
తాజావార్తలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!