Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood vs South: పాన్ ఇండియా సినిమాల శకం మొదలైన తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటీనటుల రెమ్యునరేషన్లు, పాత్రల ప్రెజెంటేషన్, గ్లామర్ ట్రీట్మెంట్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్‌కు భిన్నంగా బోల్డ్, మోడ్రన్ లుక్స్‌లో కనిపించడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు, చర్చలకు దారితీస్తోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ‘మనసాగదే’ పాటలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం వైరల్‌గా మారింది. సాధారణంగా హుందా పాత్రల్లో కనిపించే నయన్ ఇలాంటి రగ్డ్ లుక్‌లో చూడటంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ మేకోవర్ కథలో భాగమా? లేక గ్లామర్ యాంగిల్లో భాగమా? అనే చర్చ మొదలైంది.
అదే సినిమాలో కియారా అద్వానీ పోషించిన నాదియా పాత్రపైనా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలపై ట్రోలింగ్ జరగడంతో ఇటీవల జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో యష్ స్పందిస్తూ.. కథ డిమాండ్ మేరకే ఆ సన్నివేశాలను తెరకెక్కించారని, పూర్తి అవగాహన లేకుండా విమర్శించడం సరికాదని అన్నారు. ఇక రామ్‌చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర కూడా చర్చకు దారితీసింది. తన పాత్రను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారంటూ వచ్చిన విమర్శలపై జాన్వీ అసంతృప్తి వ్యక్తం చేయగా.. దర్శకుడు బుచ్చిబాబు స్పందించి క్షమాపణలు కూడా చెప్పారు. మరోవైపు రష్మిక మందన్న, మృణాల్ ఠాకుర్, పూజా హెగ్దే వంటి హీరోయిన్లు కూడా సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్లో మరింత మోడ్రన్, గ్లామరస్ లుక్స్‌లో కనిపించారు. త్రిప్తి డిమ్రి అయితే ‘యానిమల్’లో బోల్డ్ పాత్రతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు పాత్రకు తగ్గట్టుగా తమ లుక్స్, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం సాధారణంగా మారింది. అయితే ఇది కథలో భాగమా? లేక మార్కెట్, గ్లామర్ డిమాండ్‌కు అనుగుణమైన వ్యూహమా? అన్నది ప్రతిసారి ఆసక్తికర చర్చగా మారుతోంది.
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్..
- Dada : 'దాదా'గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
- Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
- 'Panchanama' Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!