Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Job Fraud: గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సహచరులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన విజయ నరసింహ, వరుణ్ అనే విద్యార్థులు “వెబ్ ఎక్స్” పేరుతో స్టార్టప్ కంపెనీ నడుపుతున్నామని తోటి విద్యార్థులను నమ్మించినట్లు సమాచారం. తమ కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, భారీ ప్యాకేజీలతో ప్లేస్మెంట్లు కల్పిస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు.
ఈ నమ్మకంతో పలువురు విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులకు అనుమానం మొదలైంది. దీంతో విజయ నరసింహ, వరుణ్‌లను పలుమార్లు ప్రశ్నించగా వారు కమాయమాటలు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితులు చెబుతున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇంకా మరెవరైనా ఈ మోసంలో ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!