ఋషికొండపై కట్టడాలను కోర్టులు కాదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ప్రశ్నించారు.. మంత్రి బొత్స.. కోర్టులను ఎవరూ కాదనలేరన్న ఆయన.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండపై నిర్మాణాలు చేపట్టాం అన్నారు.
విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి