Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి… మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దని చెపుతున్నారు.. విజయవాడలో ఉదయం నుంచీ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.. ఇక, మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మంగినపూడి బీచ్ లో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. 100 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు.. దీంతో, సముద్ర తీరానికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. తుఫాన్ దెబ్బకి భారీగా ఎగసి పడుతున్నాయి రాకాసి అలలు.. కోడూరు బసవన్న పాలెంలో కరకట్టను తాకుతున్నాయి సముద్ర అలలు.. డేంజర్ జోన్ లో దివిసీమ ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ ఉన్నయంటున్నారు.
Read Also: Telangana: తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం..
మరోవైపు.. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బాపట్ల – కాటమనేని భాస్కర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి, తూర్పు గోదావరి – వివేక్ యాదవ్, కాకినాడ – యువరాజ్, ప్రకాశం – ప్రద్యుమ్న, నెల్లూరు – హరికిరణ్, తిరుపతి – జె.శ్యామలరావు, పశ్చిమ గోదావరి – కన్నబాబును నియమించారు ఉన్నతాధికారులు.. ఆయా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం.. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులు కృషి చేయనున్నారు.