South Central Railway: మిచౌంగ్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణపై కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉండుందని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మంగినపూడి బీచ్ లో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. 100 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు.. దీంతో, సముద్ర తీరానికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. తుఫాన్ దెబ్బకి భారీగా ఎగసి పడుతున్నాయి రాకాసి అలలు.. కోడూరు బసవన్న పాలెంలో కరకట్టను తాకుతున్నాయి సముద్ర అలలు.. డేంజర్ జోన్ లో దివిసీమ ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ ఉన్నయంటున్నారు. మరోవైపు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.. ఏకంగా 151 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
Read Also: Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 151 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.. తెలంగాణ వైపుగా తూర్పు దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి.. ఇప్పటికే తెలంగాణకి ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. ఉభయ రాష్ట్రాల మీదుగా నడిచే 151 రైళ్లను రద్దు చేసింది.. మరోవైపు.. తుఫాన్ ప్రభావంపై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని.. హుద్‌హుద్ లాంటి పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది.. ఇప్పుడు అప్రమత్తంగాఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం.. వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే.