MLA Adinarayana Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం జగన్‌కు రాష్ట్ర పురోగతి అనేది అర్ధం కాదు. ఆయనకు పదవి కావాలి అని విమర్శించారు.. చంద్రబాబు అరెస్టు కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిపారు.. ఇప్పుడు జగన్ కి ఏదీ చెల్లడం లేదు… జగన్ కి పదవి కావాలి.. ధర్మ విస్మృతికి అలవాటు పడ్డాడు.. జలజీవన్ మిషన్, అమృత్ పధకాలు మనకు వస్తున్నాయి పవర్ […]
Minister Nimmala Ramanayudu: కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లు కళలకూ, కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం […]
Story Board: రెండున్నర నెలల పాటు రాజకీయ వేడి రాజేసిన.. బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీహార్‌లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న జాతీయ పార్టీలకు, పరువు కాపాడుకోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీలకూ.. ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అనడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే ఈసారి బీహార్ ఎన్నికల ప్రచారంలో కాస్త మార్పు కనిపించింది. ఈసారి కులాలు, మతాల కంటే అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అలాగని కుల ప్రభావం అసలు లేదని […]
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి లండన్‌లోని మే ఫెయిర్ హోటల్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇక, తన చెల్లి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే, నట సింహ నందమూరి బాలకృష్ణ.. సమాజ సేవలో చూపిన దృఢమైన నిబద్ధత, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను స్పర్శించిన మానవతా […]
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్‌కి వేలాడదీశారని […]
Suryalanka Beach Closed: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. అయితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు సముద్ర స్నానాల కోసం బాపట్ల సూర్యలంక బీచ్‌కు తరలివచ్చే దృశ్యం ఈసారి కనిపించలేదు. మొంథా తుపాన్ ప్రభావంతో సముద్రంలో ప్రమాదకర గోతులు ఏర్పడటంతో అధికారులు ముందస్తు చర్యగా బీచ్‌ను మూసివేశారు. సాధారణంగా ఈ పుణ్యక్షేత్ర కాలంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు సూర్యలంక సముద్రతీరంలో పుణ్యస్నానం ఆచరిస్తుంటారు. […]
Students Carry Tent Equipment: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Read Also: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ […]
Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం […]
Annavaram: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో నేడు శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఘనంగా జరగనుంది.. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పల్లకీలో, మధ్యాహ్నం 2 గంటలకు సత్య రథంపై రెండు విడతలుగా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన […]