ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది.. వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు.. కానీ, కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు.. అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు సీఎం వైఎస్ జగన్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు సీఎం జగన్. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్ షర్మిల)కి ఇచ్చారు.. మా కుటుంబాన్ని విభజించి…