వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఇవే నా చివరి ఎన్నికలు.. నేను చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారు అని వెల్లడించారు.
ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసింది.. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ్టితో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు ఈ రోజు పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.
నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్.
మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు ఘంటా శ్రీనివాసరావు. ఈ ఘటనతో సీఎం వైఎస్ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారని తెలిపారు