Nadella Manohar: పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు..! ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadella Manohar: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.. వాలంటీర్ ల వ్యవస్థకు బాధ్యులు ఎవరు..? అని మండిపడ్డారు. ప్రజల వ్యక్తి గత సమాచారం తీసుకుని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు.. అలా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? ఇవే ప్రశ్నలు పవన్ కల్యాణ్ అడిగారు.. ఇలా ప్రశ్నిస్తే వాలంటీర్ ల వ్యవస్థను దూషించినట్లా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తన సైన్యం అని చెప్పుకునే, 2,55,461 మంది వాలంటీర్లలో 1,02,836 వాలంటీర్ల డేటా అసలు రికార్డులలోనే లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అసలు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు తెలియదు..? అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం అని ప్రకటించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
Read Also: Mahesh kumar Goud: మంత్రి ఉత్తమ్ ప్రెసెంటేషన్ తో హరీష్ దిమ్మతిరిగింది
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
కాగా, గతంలో పలు సందర్భాల్లో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. అసలు వాలంటీర్లకు నాయకుడు ఎవరు? వారికి అన్ని అధికారాలు ఎందుకు? ప్రజల వివరాలు తీసుకెళ్లే ఎక్కడో పెట్టేస్తున్నారు.. ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంది అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇదే సమయంలో.. పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనలు నిర్వహించిన విషయం విదితమే.. ఇదే సందర్భంలో పోలీస్ స్టేషన్లలో సైతం ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. అయితే, తాను మొత్తం వాలంటీర్ వ్యవస్థను తప్పుబట్టడం లేదని.. వాలంటీర్లలో ఉన్న కొందరు క్రిమినల్స్ గురించేనని.. అయినా అందరి డేటాను ఎవరి చేతిలోనో పెట్టాల్సిన అవసరం ఏంటి? అని పవన్ నిలదీసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..