Vijayawada: చలో విజయవాడకు సీపీఎస్ ఉద్యోగుల పిలుపు.. అమల్లో 144 సెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ, రేపు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.. సీపీఎస్ వల్ల తమకు అన్యాయం జరిగిందని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నని అంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు.. జీపీఎస్ వల్ల తమ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయి.. కానీ, అత్యవసర పరిస్ధితుల్లో వారి డబ్బులు వారే వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా మారిపోవడం, సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బు మొత్తం కాకుండా అందులో కొంత భాగమే రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇవ్వడాన్ని సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
Read Also: Kandula Durgesh: భయంతోనే పవన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉంటే తాము దాచుకున్న డబ్బులోంచి ఆపిన డబ్బుకే వడ్డీ లెక్కేసి పెన్షన్ గా ఇవ్వడం ద్వారా అన్యాయం జరిగిందనేది సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే, సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ, రేపు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.. మరోవైపు, ఛలో వరకు విజయవాడ నిర్వహించాలని చూసిన సీపీఎస్ నాయకులు పలువురిని ఇప్పటికే అరెస్టులు చేసారు పోలీసులు.. ఎవరూ ఆందోళనకు పాల్గొన్నా అరెస్ట్‌లు తప్పవని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. అయితే, ఏపీ సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. . అందులో భాగంగా విజయవాడ ధర్నాచౌక్ లో ఛలో విజయవాడ నిర్వహణకు అనుమతులు కోరగా పోలీసులు నిరాకరించారు.. పలువురు సీపీఎస్ నాయకులను అరెస్టులు చేసారు.. సీపీఎస్ వద్దు ఓపీఎస్ కావాలి అనేది మాత్రమే తమ డిమాండ్ అని అంటున్నారు సీపీఎస్ సంఘ జాయింట్ సెక్రెటరీ సి.మరియదాసు.. జీపీఎస్ కు ఎలాంటి మద్దతు తెలపలేదని, ఆ అంశంపై చర్చలే జరగలేదని.. ఏ నలుగురూ అయితే జీపీఎస్ కు సరే అన్నారో వారికి అమలు చేయమని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..