నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకున్నానని ప్రకటించారు.. ఇక, యాంటీ మోడీ ఓటింగ్ ఇండియా కూటమి కి ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న సమస్య పెద్ద విబేధం ఏం చూపదన్నారు.. నేనేమీ పెద్ద కష్టాలు చూస్తాను అనుకోవడం లేదని చమత్కరించారు ఉండవల్లి..
అసలు పవన్ కల్యాణ్ కామెంట్లల్లో తప్పేం లేదు అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది.. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.