Buddha Venkanna: చంద్రబాబు నా గుండెల్లో ఉంటారు.. ఆవేదన వేరు.. ప్రేమ వేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buddha Venkanna: చంద్రబాబు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని వెల్లడించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బుద్ధా వెంకన్న.. ఈ రోజు విజయవాడలో ఆత్మీయ సమవేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టికెట్ కోసం ఆత్మీయ సమావేశం పెడతామని నా అభిమానులు నన్ను కలిశారు.. టికెట్ కోసం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తే తప్పులేదు.. డిమాండ్ చేయటం సరికాదు అనేది నా ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం టికెట్ ఇస్తే మంచి.. లేకపోతే చెడు చేయయమే అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు.. కానీ నేను అలా కాదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను టికెట్ కోసం రిక్వెస్ట్ చేద్దాం.. కానీ, జనసేన కు టికెట్ ఇవ్వటం ఎంటి అని ప్రశ్నిస్తే పీక కోసుకుంటాను అని ముందే చెప్పాను అని గుర్తుచేసుకున్నారు. నాకు ఎమ్మెల్యే, మంత్రి పదవుల కంటే చంద్రబాబు దగ్గర హనుమంతుడుగా ఉన్న పేరే ఎక్కువ.. చంద్రబాబు రాముడు అయితే నేను హనుమంతుడు అనే పేరు ఉంది.. అది నేను బ్రతికి ఉన్నంత కాలం పోగొట్టుకోను.. టికెట్ ఇస్తే మంచి లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. కొడాలి నాని, కేశినేని నాని, వల్లభనేని వంశీకి నాకు తేడా ఏముంది? అని ప్రశ్నించారు.
Read Also: Anupama Parameswaran : గాల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తున్న అనుపమ.. వీడియో వైరల్..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టికెట్ వచ్చినా రాకపోయినా లాయల్ గా ఉండాలి అని చెప్పాలి అనేదే ఈ మీటింగ్ ఉద్దేశం అన్నారు. ఆవేదన వేరు.. ప్రేమ వేరన్న ఆయన.. నాకు చంద్రబాబు అంటే ప్రేమ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏమీ చేయను అని స్పష్టం చేశారు. చంద్రబాబుకి నా ఆవేదన కాదు.. ప్రేమ చెప్పటానికే నా ప్రయత్నం అన్నారు. పశ్చిమ టికెట్ ఎవరికి ఇచ్చినా 100కి లక్ష శాతం పనిచేస్తాను అని పేర్కొన్నారు. చంద్రబాబు నా గుండెల్లో ఉంటారు.. నేను బల ప్రదర్శన చేసినా, రక్తంతో కాళ్లు కడిగినా అదీ చూసే వారి కోణం బట్టి ఉంటుందన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ప్రకటించారు. కొందరు శత్రువులు, నేనంటే పడని వాళ్లు ఇదంతా అధిష్టానంపై ఒత్తిడి కోసం అని చెబుతారు అంటూ మండిపడ్డారు బుద్ధా వెంకన్న.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!