* నేడు దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు పోలింగ్.. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా 41 మంది ఏకగ్రీవం.. నేడు 15 రాజ్యసభ స్థానాలకు జరగనున్న పోలింగ్.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు
* నేడు ఏపీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన.. విశాఖలో భారత్ రైజింగ్ పేరుతో మేధావులతో సమావేశం.. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్న రాజ్‌నాథ్, ఏలూరులో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమ్మేళనం, సా.4 గంటలకు బహిరంగ సభలలో పాల్గొననున్న రాజ్‌నాథ్
* అమరావతి: నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ ముఖ్యనేతల సమావేశం.. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలో నేతలకు జగన్ నిర్దేశం
* తెలంగాణలో నేడు మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం.. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు.. సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
* ఏపీలో నేటి నుంచి మార్చి 6వ తేదీ వరకు టెట్.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్
* విశాఖ: నేడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ ల సంఘం కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ , రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ.
* విశాఖ: నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న విశాఖ జిల్లా కాపునాడు నాయకత్వం.. పాల్గొననున్న రాష్ట్ర జేఏసీ సభ్యులు..
* విశాఖ: నేడు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ పర్యటన.. మెడి టెక్ జోన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
* బాపట్ల : అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం పి. గుడిపాదు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభా వేదిక స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ ముఖ్య నేతలు..
* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* ప్రకాశం : గిద్దలూరు షాదీఖానాలో టీడీపీ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశం.. ముఖ్య అతిధులుగా హాజరుకానున్న మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ ఫరూక్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ మహమ్మద్..
* ప్రకాశం : ఒంగోలులో సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన డ్వామా కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఇవాళ్టి నుంచి నిరసన కార్యక్రమాలు..
* తిరుమల: ఇవాళ ఢిల్లీకి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. టీటీడీ కాలేజీకి ప్రిన్సిపల్ నియామకం చెయ్యనున్న కమిటీ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్.. పార్టీ నేతలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉద్యోగుల గ్రీవెన్స్ డే. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ నిర్వహణ
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి శనగలు కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ.5440/- ఆర్భికే ల ద్వారా కొనుగోళ్లు.. జిల్లాస్థాయి కొనుగోలు కమిటీ నిర్ణయం మేరకు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
* అనంతపురం : నేడు వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం.
* నేడు ఏలూరులో కేంద్రరక్షణ శాఖమంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన.. ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరగనున్న బిజేపి బూత్ స్థాయి కార్యకర్తల సమ్మెళనానికి హాజరు.. సాయంత్రం 4గంటలకు సభ..
* పార్వతీపురం మన్యం జిల్లా: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు మేరకు సాలూరు రూరల్ పోలీసులు ఆధ్వర్యంలో నేడు ఉచిత మెగా వైద్యశిభిరం నిర్వహణ.
* నేడు పార్వతీపురం మున్సిపల్ సాధన సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి రూరల్ టికెట్ కందుల దుర్గేష్ కు ఇవ్వాలని జనసేన భారీ ర్యాలీ..