TDP: ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను ఐవీఆర్ సర్వే టెన్షన్ పెడుతోంది.. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు, నరసరావుపేటలో యరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం.. ఇక, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో.. సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట.. రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో టెన్షన్‌లో పడిపోయారట మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
Read Also: Telanagan: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి
మరోవైపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు చేసింది టీడీపీ అధిష్టానం.. ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లల్లో సర్వేలు చేసింది.. ఇక, ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో కళా వెంకట్రావు ఉన్నారు.. ఎచ్చెర్ల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారాయన.. ఇక, దెందులూరు నుంచి చింతమనేనికి కూడా క్లారిటీ రాలేదు.. చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే నడిచింది.. అనకాపల్లి టిక్కెట్ ఆశించిన పీలా గోవింద్ డైలామలో ఉన్నారు..
Read Also: KA Paul: పవన్‌కి ఇదే నా ఓపెన్ ఆఫర్.. ఎంత డబ్బు కావాలి..? మా పార్టీలో చేరితే సీఎంని చేస్తా..!
మరోవైపు.. బండారు సత్యనారాయణ మూర్తి సీటుపై కూడా క్లారిటీ రాలేదు.. పెందుర్తి టిక్కెట్ ఆశిస్తోన్నారు బండారు. ఇక, చీపురుపల్లి వెళ్లమని గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధిష్టానం సూచించిందట.. అయితే, భీమిలే కావాలంటూ గంటా పట్టు పడుతున్నారని సమాచారం.. ఉంగుటూరు టిక్కెట్ ఆశిస్తోన్న గన్ని వీరాంజనేయులుకూ క్లారిటీ రాలేదు.. చంద్రబాబు నివాసానికి వచ్చిన గన్ని.. ఆ విషయంపై మాట్లాడి వెళ్లారు.. కోవ్వూరు టిక్కెట్ కోసం తంటాలు పడుతున్నారు మాజీ మంత్రి జవహర్.. ఇలా టీడీపీ సీనియర్లలో టికెట్ల వ్యవహారం టెన్షన్ పెడుతోంది.