Mudragada Padmanabham: ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. అంతేకాదు.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం కూడా చేశారు. ముద్రగడ పద్మనాభంగా ఉన్న నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన విషయం విదితమే.. అయితే, పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను.. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి.. నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను అన్నారు.
Read Also: OnePlus 12 Glacial White: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ తెలుసుకుందామా..
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
మరోవైపు.. ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ.. అయితే, నా రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చే శారు.. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ పద్మనాభం.. కాగా, పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. సోషల్ మీడియా వేదికగా.. ముద్రగడను ట్రోల్ చేస్తున్న విషయం విదితమే.. ఈ రోజు సాయంత్రమే పేరు మార్చుకునే కార్యక్రమం అంటూ.. ఓ కార్డును కూడా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు నెటిజన్లు.
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!