* టీ-20 వరల్డ్‌కప్: నేడు భారత్‌తో ఐర్లాండ్ ఢీ.. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఉదయం 11.30 గంటలకు కేంద్రి కేబినెట్ సమావేశం.. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చ
* ఢిల్లీ: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, నితీష్ కుమార్
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఎన్డీఏ భేటీలో ఏపీకి సంబంధించిన ఏయే అంశాలపై చర్చించాలనే విషయంపై సమాలోచనలు.. ఏపీ కేబినెట్ కూర్పు, తదితర అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయం
* నేడు తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
* ఏపీ: నేడు ఉదయం మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవనున్న సీఎస్ జవహర్‌రెడ్డి..
* తిరుమల: 18వ తేదీన సెప్టెంబర్ నెలకు సంభందించిన దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,291 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,495 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.14 కోట్లు
* తిరుపతి: నేడు జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్.. మంగళగిరికి బయలుదేరిన ఆరణి శ్రీనివాసులు.. నేడు, రేపు మంగళగిరిలో ఉండనున్న ఆరణి శ్రీనివాసులు
* తూర్పుగోదావరి జిల్లా: ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు.. నేడు కొనసాగుతున్న మద్యం అమ్మకాలపై నిషేధం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రాజమండ్రి పుష్కరాలరేవును శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టనున్న గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు