అభివృద్ధి విషయంలో నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. అలాంటి బాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు..? అని ప్రశ్నించారు ఏపనీ సీఎం వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజల్లో నమ్మకముండాలి.. ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ఆ నాయకుడిపై ఉండాలి అన్నారు
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా ఉండటంతో.. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో.. కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు.
ఈ రోజు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది.