చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్ అయ్యారు పోసాని.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరికాదు అని హితవుపలికారు.
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు.
తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు