Andhra Pradesh: ప్రజల నుంచి సమస్యల పరిష్కారానికి ‘స్పందన’పేరుతో వినతులు స్వీకరిస్తూ వచ్చింది గత ప్రభుత్వం.. ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో ఈ కార్యక్రమం నిర్వహించేవారు.. అయితే, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందనను ప్రక్షాళన చేపట్టనుంది చంద్రబాబు సర్కార్.. స్పందన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. జిల్లాల కలెక్టరేట్లల్లో ప్రతి సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తోన్న కలెక్టర్లు, అధికారులు.. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరభ్ పేరుతో మెమో జారీ చేశారు.. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతుల స్వీకరించనున్నారు.. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
Read Also: CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం(వీడియో)