ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసులు.. నడిరోడ్డుపైకి వచ్చి పబ్లిక్‌గా కొట్టుకోవడం చర్చగా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. ముసునూరు మండలానికి వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకుల అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కారును అడిగించి పలువురు కార్యకర్తలు.. దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశంలో హాజరైన…
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు.. అయితే, సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యాయింది.. కంటి పై భాగంలో బాటిల్ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ... తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు.